Sabarimala: దేశవ్యాప్తంగా మూసుకున్న అయ్యప్ప ఆలయాల తలుపులు... అన్ని చోట్లా సంప్రోక్షణకు గురుస్వాముల పిలుపు!

  • దావానలంలా వ్యాపించిన వార్త
  • అయ్యప్ప ఆలయాలను మూసివేసిన పూజారులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న సంప్రదాయవాదులు
శబరిమలలో ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకున్నారన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా అన్ని అయ్యప్ప ఆలయాలనూ మూసేసినట్టు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను మూసివేయగా, సంప్రోక్షణల అనంతరం శబరిమలలో స్వామి గర్భగుడి తలుపులు తెరిచిన తరువాతనే ఆలయాలను తెరవాలని గురుస్వాములు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు ఆలయాలకు చేరుకుని నిరసనలు తెలియజేస్తున్నట్టు సమాచారం. మహిళలకు దర్శనంపై సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, సంప్రదాయవాదులు, కేరళ మహిళలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.
Sabarimala
Ayyappa
Ladies
Temples
Shut Down
Close

More Telugu News