Bhumata Brigade: బిందు, కనకదుర్గలు వీరే... తృప్తి దేశాయ్ ప్రశంసల వర్షం!
- నేను చేయలేకపోయిన పనిని వీరు సాధించారు
- శుద్ధి చేయాలనడం భారత మహిళలకు అవమానం
- భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్
శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా నారీ శక్తి ఏంటన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ వ్యాఖ్యానించారు. నెలన్నర క్రితం తాను చేయలేకపోయిన పనిని నేడు బిందు, కనకదుర్గలు చేసి చూపించారని ఈ ఉదయం మీడియా ముందు వ్యాఖ్యానించిన ఆమె, సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు.
ఈ సందర్భంగా, ఇద్దరు మహిళలను స్వామి సన్నిధికి పంపిన కేరళ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, అతి త్వరలో తాను కూడా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని అన్నారు. మహిళల ప్రవేశంతో అనాదిగా వస్తున్న చాందస సంస్కృతి తుడిచిపెట్టుకుపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రవేశం తరువాత గర్భగుడి తలుపులు మూసివేయడం, శుద్ధి చేయాలని నిర్ణయించడాన్ని ప్రశ్నించిన తృప్తీ దేశాయ్, ఇది యావత్ భారత మహిళలకే అవమానమని మండిపడ్డారు.అయ్యప్పను దర్శించుకున్న మహిళలు బిందు, కనకదుర్గలు వీరే