Krishi Vigyan Kendra: ఆటగాళ్ల డైట్‌లో కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చండి: కోహ్లీ, బీసీసీఐకి లేఖలు రాసిన కృషి విజ్ఞాన కేంద్రం
- సాధారణ చికెన్‌లో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువ
- కడక్‌నాథ్ చికెన్‌లో ప్రొటీన్లు, ఐరన్ పుష్కలం
- ఇకపై ఈ చికెన్‌నే తినండి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), టీమిండియా సారథి విరాట్ కోహ్లీలకు మధ్యప్రదేశ్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రం, ఝాబా (కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్) లేఖలు రాసింది. ఆటగాళ్ల ఆహారంలో ఝాబాస్ కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని కోరింది. టీమిండియా డైట్‌లో గ్రిల్ల్‌డ్ చికెన్ ఉంటోందని, అందులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ అధికశాతంలో ఉంటాయని పేర్కొంది.
కడక్‌నాథ్ చికెన్‌లో అతి తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఉంటుందని ఇది ఆటగాళ్లకు ఎంతో మంచిదని లేఖలో పేర్కొంది. ఈ చికెన్‌లో ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయని వివరించింది. హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని వివరించింది. కాబట్టి ఇకపై సాధారణ చికెన్ స్థానంలో కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని కోరుతూ లేఖలు రాసింది.