East Godavari District: కోడిపందాలు కావాలంటూ గోదావరి జిల్లాల్లో ప్లెక్సీలు!
- జల్లికట్టు తరహాలో అనుమతి ఇవ్వండి
- కోరుతున్న 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ'
- పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పేరు చెబితే గుర్తుకు వచ్చే వాటిల్లో రంగవల్లులు, గొబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టింది పేరన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకున్నా, పండగ రోజుల్లో ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ప్లెక్సీలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఆంధ్రాలో సంక్రాంతి పండగ రోజులలో కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ' పేరిట ఇవి వెలిశాయి.