Telangana: తెలంగాణలో మందుబాబులు పెరిగారు.. దక్షిణాదిలోనే అత్యధిక మద్యం అమ్మకాలు!

  • గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతానికి పైగా పెరిగిన అమ్మకాలు
  • ఆంధ్రప్రదేశ్ లో 19 శాతం పెరిగిన విక్రయాలు
  • బీర్ కు అత్యధిక డిమాండ్ కూడా తెలంగాణలోనే

దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మద్యం వినియోగంలో ముందుంది. తెలంగాణలో అమ్మినంత మద్యాన్ని మరే రాష్ట్రంలోనూ అమ్మలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకూ గత సంవత్సరంతో పోలిస్తే, 20.11 శాతం మేరకు తెలంగాణలో అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో ఏపీలో 19 శాతం, తమిళనాడులో 17.7 శాతం, కేరళలో 15.15 శాతం, కర్ణాటకలో 12.1 శాతం మేరకు అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక తెలంగాణలో బీర్ లకు అత్యధిక డిమాండ్ ఉందని కూడా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 302.84 లక్షల బీర్ కేసులు తెలంగాణలో అమ్ముడవగా, ఏపీలో 169 లక్షల బీర్ కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక డబ్బు విషయానికి వస్తే, ఏపీలో మొత్తం రూ. 9,720 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, తెలంగాణలో రూ. 11,894 కోట్ల అమ్మకాలు సాగాయి. కేరళలో రూ. 8,357 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి. ఇదిలావుండగా, డిసెంబర్ 31 రాత్రి ఏపీలో రూ. 118 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగగా, తెలంగాణలో రూ. 133 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి.

  • Loading...

More Telugu News