sensex: అమ్మకాల ఒత్తిడి.. భారీగా నష్టపోయిన మార్కెట్లు
- వరుసగా రెండో రోజు నష్టాలు
- మెటల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి
- 377 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ఫ్లాట్ గా సూచీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మెటల్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ తదితర సెక్టార్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో... భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 377 పాయింట్లు పతనమై 35,513కు పడిపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 10,672కు దిగజారింది.
యాక్సిస్ బ్యాంక్, వేదాంత, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ తదితర స్టాకులు నష్టపోయాయి. బజాజ్ ఆటో, హెచ్సీఎల్, ఏషియన్ పెయింట్స్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.