ayodhya: అయెధ్య రామ మందిరం కేసుపై కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
- కేసును కొత్త ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయం
- విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుంది
- తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా
వివాదాస్పద అయోధ్య రామ మందిరం కేసును కొత్త ధర్మాసనానికి కేటాయించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయోధ్య ఆలయ నిర్మాణం అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా, విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, అయోధ్య వివాదంపై మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.