car: సైకిల్ ను ఢీకొని తుక్కైన కారు.. వీడియో చూడండి

  • దక్షిణ చైనాలోని షెంఝెన్ నగరంలో విచిత్ర ఘటన
  • సైకిల్ ఢీకొనడంతో కారుకు డ్యామేజ్
  • చెక్కు చెదరని సైకిల్
ఒక సైకిల్, ఒక కారు ఢీకొంటే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. సైకిల్ తుక్కు తుక్కు అవుతుంది. కానీ చైనాలో దీనికి విరుద్ధంగా దిమ్మతిరిగే ఘటన జరిగింది. సైకిల్ ను ఢీకొన్న కారు ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనలో కారు బంపర్ మొత్తం లోపలకు నొక్కుకుపోయింది. ఇదే సమయంలో సైకిల్ కు కొంచెం కూడా డ్యామేజ్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణ చైనాలోని షెంఝెన్ నగరంలో ఇది చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో దీని ఫొటోలు చూసినవారు... ఫేక్ ఫొటోలు అని భావించారు. కానీ, స్థానిక పోలీసులు ఇది నిజంగా జరిగిందంటూ స్పష్టతనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్ర గాయాలకు గురి కాలేదని, సైకిల్ పై ఉన్న వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.
car
bicycle
china
collision
shenzen

More Telugu News