appco: చేనేత ను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలి: జైట్లీకి ఎంపీ బుట్టా రేణుక వినతి
- జైట్లీని కలిసిన తెలుగు రాష్ట్రాల నేతన్నలు
- నేతృత్వం వహించిన బుట్టా రేణుక
- జైట్లీకి వినతి పత్రం సమర్పణ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీడీపీ ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలోని తెలుగు రాష్ట్రాల నేతన్నలు ఈరోజు కలవడం జరిగింది. చేనేత పరిశ్రమను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలంటూ ఓ వినతిపత్రం సమర్పించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలపై భారం పడిందని, ముడిసరుకులపై పన్ను అదనం కావడంతో కార్మికులకు కష్టంగా మారిందని మంత్రికి తెలియజేశారు. చేనేత పరిశ్రమ మూతపడే పరిస్థితికి వచ్చిందని, మరమగ్గాలు, రంగులు, చిన్న చిన్న ముడి వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయాలని, జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు.