CPI Narayana: తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు.. ఏపీలోనూ అదే రిపీట్ కాబోతోంది!: సీపీఐ నారాయణ
- ఏపీని కేంద్రం దగా చేసింది
- బీజేపీకి తెలుగురాష్ట్రాల్లో పుట్టగతులుండవు
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత
ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం దగా చేసిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. 2014లో తీసుకొచ్చిన ఏపీ పునర్విభజన చట్టాన్ని కూడా కేంద్రం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేకహోదా సాధన సమితి ధర్నా నేటితో రెండో రోజుకు చేరుకున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల బీజేపీకి డిపాజిట్లు రాలేదని నారాయణ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పలితం పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. కాగా, ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధన సమితి చేపడుతున్న ధర్నాకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాఘవులు, చలసాని శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు.