2000: రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేశాం: అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి
- ఆర్థిక వ్యవస్థలో తగిన స్థాయిలో రూ. 2వేల నోట్లు ఉన్నాయని వివరణ
- భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి.. నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తాం
పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అధికారికంగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో రూ. 2వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నాయని... అందువల్ల వాటి ముద్రణను నిలిపివేశామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మన మొత్తం కరెన్సీలో 35 శాతానికి పైగా రూ. 2వేల నోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి, కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామని తెలిపారు.