Andhra Pradesh: జనసేన కార్యకర్తలను గందరగోళంలో పడేయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు!: పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు
- ఆయన వ్యాఖ్యలు అందులో భాగమే
- అమరావతిలో పార్టీ నేతలతో భేటీ
- తనతో కలిసిరావాలని ఇటీవల పవన్ ను కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం జనసేన మొదటి నుంచి పోరాడుతూనే ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్రం వ్యవహారశైలిని జనసేన ప్రశ్నిస్తూనే ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ తనతో కలిసి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. అమరావతిలో ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన పవన్ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల సంసిద్ధతపై చర్చించారు.
ఈ సందర్భంగా తనతో కలిసి రావాలని చంద్రబాబు కోరడంపై పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు పన్నుతున్న ట్రాప్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన నేతలు, కార్యకర్తలను గందరగోళంలో పడేయడానికి చంద్రబాబు వేసిన వ్యూహాల్లో ఇది ఒకటి అని అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.