Bluefin Toona: ఈ చేప ధర ఎన్ని కోట్లో తెలుసా?
- రూ.22 కోట్లు పలికిన బ్లూఫిన్ టూనా జాతి చేప
- వేలంలో చేపను సొంతం చేసుకున్న కిపోషి
- ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి
ఈ చేప ఖరీదు వింటే షాక్ అవుతారు. వందలో.. వేలో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆ చేప ఖరీదు అక్షరాలా రూ.22 కోట్లు. జపాన్లో దాదాపు 278 కేజీల బరువున్న బ్లూఫిన్ టూనా జాతికి చెందిన చేపను వేలం వేశారు. ఈ వేలంలో ఆ చేపను టోక్యోలోని జపనీస్ సుషీ రెస్టారెంట్ ఓనర్ కిషోషీ కిమురా రూ.22 కోట్లకు సొంతం చేసుకున్నాడు.
టోక్యోలోని కొత్త ఫిష్ మార్కెట్లో ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారట. దీనిపై చేపను సొంతం చేసుకున్న కిమురా చెబుతూ, ఏదో రూ.3-4 కోట్లు పలుకుతుందని భావించానని, అయితే తాను అనుకున్న దానికంటే ఐదు రెట్లు పైనే ధర పలికిందని.. అంత రేటు పలకడంతో ఆశ్చర్యపోయానని అన్నాడు. ఆ చేపను సుకిజీ ప్రాంతంలోని తమ రెస్టారెంట్ బ్రాంచికి తరలించారు. అయితే ఈ చేప ఒక్కొక్క ముక్క ధరను ఇంతకు విక్రయించేది ఇంకా నిర్ణయించలేదు.