suvidha express: పండగ రైళ్లు వస్తున్నాయి... సంక్రాంతికి మరో నాలుగు సువిధ ప్రత్యేక సర్వీస్‌లు

  • ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
  • సికింద్రాబాద్‌, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం నుంచి నడపనున్నట్లు వెల్లడి
  • 11వ తేదీ నుంచి అందుబాటులోకి

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం నుంచి నాలుగు సువిధ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ఈనెల 11వ తేదీన ఈ పూర్తి  ఏసీ రైలు తొలి సర్వీస్‌ సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. ఆ రోజు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరునాడు 12కి విశాఖ నగరానికి చేరుకుంటుందని, అదే రోజు తిరుగు ప్రయాణం అవుతుందని సీపీఆర్‌ఓ సిహెచ్‌.రాకేష్‌ తెలిపారు. 13వ తేదీకి సికింద్రాబాద్‌కు తిరిగి చేరుతుందని తెలిపారు.

అదే విధంగా 17వ తేదీన కాకినాడ నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్‌ శివారు లింగంపల్లి వరకు, 20న మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు మరో రెండు సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణించవు. రాయనపాడు మీదుగా రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News