t-congress: అనుచిత వ్యాఖ్యల ఫలితం.. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్ష న్ వేటు!
- కుంతియా, ఉత్తమ్ లపై సర్వే అనుచిత వ్యాఖ్యలు
- టీ-పీసీసీ నేత బొల్లు కిషన్ పై సర్వే దాడి
- క్రమశిక్షణాచర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెన్షన్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది.
ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆదేశాల మేరకు సర్వేను పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. కాగా, మల్కాజ్ గిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కుంతియా, ఉత్తమ్ లపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు వార్తలొచ్చాయి. తనను అడ్డుకున్న బొల్లు కిషన్ పై ఆయన వాటర్ బాటిల్ విసిరారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. సమావేశం మధ్యలోనే సర్వే అలిగి వెళ్లిపోయారు.