Team India: టీమిండియా ఆశలకు వర్షం అడ్డుకట్ట.. ప్రారంభం కాని మ్యాచ్

  • ఐదో రోజు ఒక్క బంతి కూడా పడని వైనం
  • మరికాసేపట్లో పిచ్ పరిశీలన
  • మ్యాచ్ రద్దు అయినా సిరీస్ భారత్‌దే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో విజయం ముంగిట నిలిచిన భారత్ ఆశలను వర్షం అడియాసలు చేసేలా కనిపిస్తోంది. నాలుగో రోజు  ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం ఐదో రోజు కూడా ఆటంకం కలిగించింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఆట ప్రారంభం కాలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.  

కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. భారత్ కంటే 316 పరుగులు వెనకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అవడంతో ఫాలో ఆన్ ఆడుతోంది. దీంతో ఆసీస్ పరాజయం తప్పదని భావించారు. అయితే, వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్ రద్దయినా 2-1తో  సిరీస్ భారత్‌ సొంతమవుతుంది.

  • Loading...

More Telugu News