nagababu: మీరంతా మాలాగా మనుషులే.. ఒక తల్లిదండ్రులకు పుట్టినవారే!: బాలకృష్ణకు నాగబాబు కౌంటర్
- చిరంజీవి ఏమయ్యాడు అని బాలయ్య అన్నారు
- మా ఫ్యామిలీని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది
- మీరేమన్నా ఆకాశం నుంచి దిగివచ్చారా?
స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అంతే పెద్ద స్టార్ అని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. అలాంటి అమితాబ్ బచ్చన్ ను ఏం పీకాడు? అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అమితాబ్ ఎన్డీఆర్ వయసున్న వ్యక్తి అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ఏం పీకాడు? అని బాలయ్య అన్నప్పుడు చాలా బాధ కలిగిందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఉదయం నాగబాబు బాలయ్య వ్యాఖ్యలపై ఫేస్ బుక్ లో ఓ వీడియోను విడుదల చేశారు.
అయినా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేదనీ, కానీ ‘చిరంజీవి ఏమయ్యాడు’ అని బాలయ్య వ్యాఖ్యానించారని మండిపడ్డారు.ఈ టాపిక్ లో తమ కుటుంబాన్ని చేర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నాగబాబు ప్రశ్నించారు. ’చిరంజీవి పేరును ప్రస్తావించినప్పటికీ మాకు అభ్యంతరం లేదు. కానీ మీ బ్లడ్ వేరు.. మీ బ్రీడ్ వేరు అని బాలయ్య చెప్పారు. మీరేమన్నా ఆకాశం నుంచి దిగివచ్చారా? లేకపోతే మీరేమయినా సూర్య వంశీకులా? మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా?’ అని ప్రశ్నించారు.
అసలు బ్లడ్, బ్రీడ్ అన్న దాన్ని మనుషులు చూస్తారా? అని నిలదీశారు. ఆస్ట్రియాలో బ్లూబ్లడ్ అనే కల్చర్ ఉండేదనీ, తాము గొప్పవాళ్లమని కొన్ని రాజవంశాలు వ్యవహరించేవనీ, దీంతో ప్రజలు వాళ్లను దించేశారని గుర్తుచేశారు. బాలయ్య ఆ వీడియోలో తమను తక్కువ చేసి మాట్లాడినా తాము స్పందించలేదన్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవికి ఇలాంటి వివాదాలు ఇష్టం ఉండవన్నారు. అందుకే ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్నామన్నారు. ‘మీరంతా మాలాగే మనుషులు, మీరు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.