West Bengal: పశ్చిమ బెంగాల్ కలెక్టర్ జులుం... పోలీసు స్టేషన్లో యువకుడిని చితక్కొడుతున్న వీడియో!
- కలెక్టర్ భార్యపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు
- స్టేషన్ కు పిలిపించి బాదిన కలెక్టర్
- ఫిర్యాదు చేయకుండానే పోలీస్ ట్రీట్ మెంట్
- వైరల్ అవుతున్న వీడియో
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఐఏఎస్ అధికారి, అలీపుర్ దౌర్ జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) నిఖిల్ కుమార్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతని భార్యపై ఫేస్ బుక్ ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో, ఓ యువకుడిని పోలీసు స్టేషన్ కు పిలిపించి, అతన్ని దారుణంగా కొట్టారు నిఖిల్. ఎటువంటి ఫిర్యాదూ చేయకుండానే విచారణ పేరిట యువకుడిని చిత్ర హింసలు పెట్టారు.
పోలీసులు చూస్తుండగానే జరిగిన ఈ ఘటనను అక్కడే ఉన్న మరో పోలీసు చిత్రీకరించినట్టు తెలుస్తుండగా, ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, కలెక్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ యువకుడు తనను క్షమించాలని ప్రాధేయ పడుతున్నా నిఖిల్ నిర్మల్, ఆయన భార్య వినలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతానంటూ యువకుడిని బెదిరించారు కూడా.
ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత స్పందించాలని కోరినా నిర్మల్ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక స్టేషన్ ఇన్ స్పెక్టర్ సైతం ఈ విషయమై నోరెత్తలేదు. యువకుడిని కొట్టిన కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
See how Bengal IAS officer, Nikhil Nirmal, district magistrate of Alipurduar district take law in his own hands. He & his wife beat up a youth for making lewd comments on his wife’s Facebook profile. Incident unfolds inside the police station & infront IC of Police @dna @ZeeNews pic.twitter.com/iRCO7SnRa6
— Pooja Mehta (@pooja_zeenews) January 6, 2019