IT Act: ఇదే నిజమైతే చాలా సీరియస్... అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) తొలగింపు
- దాని ప్రకారం 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశం
తొలగించబడిన చట్టం పేరును చెబుతూ, పలువురిని అరెస్ట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 2015 నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66(ఏ)ను ఇప్పటికే తొలగించగా, 22 మందిని ఈ చట్టం కింద ప్రాసిక్యూట్ చేశారని పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిలి లిబర్టీస్) వేసిన పిల్ పై ధర్మాసనం విచారణ జరిపింది. "మేము చాలా తీవ్రమైన చర్యలకు ఆదేశిస్తాం. ఇదే నిజమైతే చాలా సీరియస్ అవుతుంది. వారిని అరెస్ట్ చేయమని ఆదేశించిన అధికారులను జైలుకు పంపించక తప్పదు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఏనాడో నిర్ణయమైపోయింది. దాన్ని చూపుతూ అరెస్ట్ లేంటి?. నాలుగు వారాల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి" అంటూ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.