upper caste: అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు... నియమ నిబంధనలు ఇవే!
- వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదు
- 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి
- నివాసం వెయ్యి చ.అడుగుల కంటే తక్కువ ఉండాలి
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించింది. దీనికి సబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
10 శాతం రిజర్వేషన్లు పొందే కుటుంబాలకు నిబంధనలు ఇవే:
- సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
- సొంత ఇల్లు 1,000 చదరపు అడుగుల కంటే తక్కువలో ఉండాలి.
- మునిసిపాలిటీ పరిధిలో వుండే నివాస స్థలం అయితే కనుక 109 చదరపు గజాల లోపులో ఉండాలి.
- మున్సిపాలిటీయేతర పరిధిలో అయితే కనుక 200 చదరపు గజాల లోపులో ఉండాలి.