sexual herament: విమానంలో తోటి ప్రయాణికురాలిపై వ్యాపారవేత్త లైంగిక వేధింపులు

  • అరవై అయిదేళ్ల వ్యాపార వేత్త నిర్వాకం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • విస్తారా విమానంలో ఘటన
కూతురు వయసున్న మహిళా ప్రయాణికురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించడమేకాక లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ వ్యాపారవేత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి ముంబయికి వస్తున్న విస్తారా విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.

 వ్యాపారవేత్త అనిల్‌కుమార్‌ మూల్‌ చందానీ ముంబయి వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆమె పక్క సీటులో 41 ఏళ్ల యువతి కూర్చుంది. ప్రయాణ సమయంలో అనిల్‌ ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. ఆమెను ఎక్కడెక్కడో అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. దీంతో ముంబయిలో దిగగానే బాధితురాలు సహారా విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అనిల్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
sexual herament
vistara airlines
case on accused

More Telugu News