Guitar: తోడబుట్టిన అన్నాచెల్లెళ్లకు ఘనంగా బాల్య వివాహం.. ఆచారంలో భాగమట!
- ఒకే కాన్పులో అన్నా చెల్లెళ్లు
- గత జన్మలో ప్రేమికులని నమ్మకం
- ఆరేళ్ల వయసులో వివాహం
బౌద్ధ ధర్మం ప్రకారం ఒకే కాన్పులో అమ్మాయి, అబ్బాయి పుడితే వారు గత జన్మలో ప్రేమికులని విశ్వసిస్తారు. గతంలో వారు ప్రేమికులు కాబట్టే ఈసారి వారు జంటగా పుట్టారని నమ్ముతారు. వారిద్దరికీ పెళ్లి చేయకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొంటారని చెబుతారు. అందుకనే ఇలా పుట్టిన వారికి ఘనంగా పెళ్లి చేస్తారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఇప్పుడు అటువంటి వివాహమే జరిగింది. అమర్నసన్ సుత్రోన్ మలిరాట్, పాచారాపర్న్ దంపతులకు 2012లో గిటార్, కివీలు జన్మించారు.
ఒకే కాన్పులో మగ, ఆడ పిల్లలు పుట్టడంతో అప్పుడే వారిద్దరికీ పెళ్లి చేసి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గిటార్, కివీలకు ఆరేళ్లు నిండగానే ఇటీవల ఘనంగా వివాహం చేశారు.
2012లో ఆడ, మగ కవల పిల్లలు గిటార్, కివీలకు జన్మనిచ్చారు. పుట్టిన వెంటనే వాళ్లద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. సంప్రదాయంలో భాగంగా చిన్నారులిద్దరితోనూ తొలుత కొన్ని ఆటలు ఆడించారు. వరుడు గిటారు తొమ్మిది తలుపులను దాటుకుంటూ వధువును కలిశాడు. ఆమెను పెళ్లాడేందుకు గిటార్ 2 లక్షల భాట్ (రూ. 4.37 లక్షల కట్నం), రూ. 8 వేల విలువైన బంగారాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఈ వివాహం నమ్మకం మాత్రమే. జీవితాంతం కలిసి ఉండరు. అన్నా చెల్లెళ్లుగానే ఉంటారు. యుక్తవయసు వచ్చాక ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్లి చేసుకుంటారు.