Andhra Pradesh: సొంత కష్టంతోనే ఏపీని అభివృద్ధి చేసుకుంటున్నాం.. ఈ విషయంలో రాజీపడం!: చంద్రబాబు

  • 13 జిల్లాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాం
  • కర్నూలులో పలు కార్యక్రమాలు ప్రారంభించాం
  • జన్మభూమి టెలీకాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం వెల్లడి
సొంత కష్టంతోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడించారు. ఏపీలోని 13 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంపై ఓ ప్రణాళికతో ముందుకు పోతున్నామని వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పిస్తున్నామనీ, రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని సీఎం అన్నారు.

అమరావతిలో ఈరోజు కలెక్టర్లు, నోడల్ అధికారులతో జన్మభూమి 8వ రోజు నిర్వహణపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు గ్రామ సభల్లో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పించడంపై ప్రధానంగా చర్చించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిన్న కర్నూలు పర్యటన సందర్భంగా పలు పరిశ్రమలతో పాటు ఓ ఆసుపత్రిని సైతం ప్రారంభించామని గుర్తుచేశారు. ఏపీ అభివృద్ధి విషయంలోరాజీ పడకుండా ముందుకు దూసుకుపోతున్నామని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu
Teleconference
development
janmabhoomi

More Telugu News