Rajya Sabha: ‘ఈబీసీల రిజర్వేషన్ బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
- బిల్లుకు అనుకూలంగా 165 ఓట్లు
- వ్యతిరేకంగా 7 ఓట్లు
- ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ తిరస్కరణ
‘ఈబీసీల రిజర్వేషన్ బిల్లు’కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ యథాతథంగా ఆమోదించింది. విపక్షాల సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ తిరస్కరణకు గురైంది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 155 ఓట్లు, అనుకూలంగా 18 ఓట్లు లభించాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణలూ వీగిపోయాయి.
కాగా, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు రాజ్యసభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.