Alok Varma: వచ్చీ రాగానే... పలు బదిలీలను రద్దు చేసిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ!

  • కీలక నిర్ణయాలు తీసుకున్న అలోక్ వర్మ
  • అక్టోబర్ 24న తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు నియామకం 
  • ఆపై పలువురు అధికారుల బదిలీలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ గా  నాగేశ్వరరావు చేసిన అధికారుల బదిలీలను రద్దు చేశారు. అక్టోబర్‌ 24 నుంచి జనవరి 8 వరకు జరిగిన పలు బదిలీలను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీబీఐలో డైరెక్టర్‌ గా ఉన్న ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ గా ఉన్న రాకేశ్‌ అస్థానాల మధ్య విభేదాలు తలెత్తగా, కేంద్రం వారిద్దరిని బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమించారు. ఆపై ఆయన పలువురిని బదిలీ చేశారు. ఇప్పుడా బదిలీలను అలోక్ వర్మ నిలిపివేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News