sensex: పెరిగిన ముడి చమురు ధరలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 106 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 33 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతం పైగా నష్టపోయిన బ్యాంకింగ్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెగిగాయి. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 60 డాలర్లను దాటింది. మరోవైపు, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో... ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. వీటి ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,106కి పడిపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 10,821 వద్ద స్థిరపడింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2.36 శాతం వరకు నష్టపోయాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, సన్ ఫార్మా, హీరో మోటో కార్ప్ లు 1.31 శాతం వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, భారతి ఎయిర్ టెల్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.