south central railway: ఇకపై రైలు బయలుదేరాక.. ఖాళీ ఉన్న బెర్తుల వివరాలు తెలుసుకోవచ్చు!

  • హెచ్‌హెచ్‌టీ వ్యవస్థ అందుబాటులోకి
  • రైలు కదిలాక రిజర్వేషన్‌పై ఆరా తీయొచ్చు
  • దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా అమలు

రైల్వే రిజర్వేషన్‌ అనగానే కన్‌ఫర్మేషన్‌, వెయిటింగ్‌ లిస్టు, చార్ట్‌ ప్రిపేర్‌...ఇవే ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశాలు. రైలు కదిలాక ఆయా బోగీల్లో చాలా ఖాళీలున్నా మనకు తెలిసే అవకాశం లేదు. టీటీ వద్దకువెళ్లి రిక్వెస్ట్‌ చేస్తే ఆయన దయా దాక్షిణ్యాలపై కేటాయింపు ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రైన్‌ కదిలాక ఎక్కడ ఉన్నా అప్పటికి ఉన్న ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే తన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం హ్యాండ్‌ హెల్డ్ టెర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా తొలిసారి ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలో డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ పరదాన్‌ గురువారం ప్రారంభించారు. హెచ్‌హెచ్‌టీ పరికరాల ద్వారా రైలు ప్రయాణంలో టికెట్లను తనిఖీ చేయనున్నారు. దీంతో రిజర్వేషన్‌ చేయించుకునే ప్రయాణికుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్ల మధ్య ఖాళీల వివరాలు అందుబాటులోకి వచ్చి వాటిని కేటాయించేందుకు సులభమవుతుంది. ఈ విధానాన్ని 51 రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలు అందించారు.

  • Loading...

More Telugu News