Madhya Pradesh: ముఖ్యమంత్రిని ‘బందిపోటు దొంగ’ అన్న హెడ్మాస్టర్.. కొరడా ఝుళిపించిన కలెక్టర్!
- మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ భరద్వాజ్
ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అసలు ఉద్యోగానికే ఎసరు వస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ ‘దోపిడి దొంగ’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు టీచర్ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జబల్పూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముకేశ్ తివారీ అనే హెడ్మాస్టర్ మాట్లాడుతూ..‘కమల్ నాథ్ ఓ బందిపోటు దొంగ’ అని చెప్పారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ చావి భరద్వాజ్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నేపథ్యంలో టీచర్ ముకేశ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
Madhya Pradesh: Headmaster suspended for derogatory remarks against CM Kamal Nathhttps://t.co/siKOwRxDEn pic.twitter.com/a5K5lk37lQ
— TOI Cities (@TOICitiesNews) January 11, 2019