Andhra Pradesh: విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్.. నోరూరించే తెలుగు వంటలు
- తెలుగు వంటకాలకు భౌగోళిక గుర్తింపే లక్ష్యం
- నోరూరించిన 66 వంటకాలు
- ప్రారంభించిన ముకేశ్ కుమార్
తెలుగు వంటకాలకు బ్రాండింగ్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఆహార పండుగ (ఫుడ్ ఫెస్టివల్)ను ప్రారంభించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విజయవాడలోని నోవాటెల్‌లో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా శుక్రవారం ఈ పండుగను ప్రారంభించారు. పసందైన 66 వంటకాలు సందర్శకుల నోరూరించాయి. తెలుగు ప్రజల ప్రత్యేక వంటకాలకు బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్టు ముకేశ్ కుమార్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు వంటకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.