Narendra Modi: మేము అధికారంలోకి వచ్చాక ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు: నిర్మలా సీతారామన్

  • ఐదేళ్లలో దేశం శాంతిభద్రలతో ఉంది
  • వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం
  • అవినీతి అంతం ఎన్డీయే సాధించిన విజయం

మోదీని గద్దె దించేందుకు సాయం కోరడానికి.. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు పాకిస్థాన్‌కు వెళ్లారని.. అది సిగ్గుచేటని రక్షణ  శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. నేడు బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని.. తాము భారీ మెజారిటీతో గెలిచామన్నారు. దేశంలో శాంతికి భంగం కలిగించేందుకు ఉగ్రవాదులకు ఎటువంటి అవకాశమూ ఇవ్వబోమని ప్రధాని మోదీ ప్రభుత్వం నిరూపించిందన్నారు.

ఈ ఐదేళ్లలో దేశం శాంతి భద్రలతో ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దేశంలో వ్యవసాయ, గృహ నిర్మాణ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా చేయడం, అవినీతి అంతం అనే అంశాలు ఎన్డీయే సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News