festival: సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ ట్యాక్స్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

  • నేడు సహా 13,16 తేదీల్లో టోల్ ట్యాక్స్ ఎత్తివేత
  • ఈ మేరకు అధికారులకు ఆదేశాలు  
  • కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా టోల్ ట్యాక్స్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. నేడు సహా 13,16 తేదీల్లో టోల్ ట్యాక్స్ ను ఎత్తివేయాలని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. కాగా, హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పలు మార్గాల్లో నడుపుతోంది. రిజర్వేషన్ ద్వారా సీట్లు లభించని ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.  

ఇదిలా ఉండగా, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ నెలకొంది.

  • Loading...

More Telugu News