CLP: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం కార్యకర్తల ప్రత్యేక పూజలు

  • ఆయన సీఎల్పీ లీడర్‌ కావాలని కోరిక
  • అప్పుడే కాంగ్రెస్‌కు పూర్వవైభవమని వ్యాఖ్యలు
  • అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పార్టీ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎల్‌పీ లీడర్‌ కావడం ఒక్కటే మార్గమని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు మునుగోడులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు మొగుదాల రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు పూజలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ లీడర్‌గా రాజగోపాల్‌రెడ్డి నియమితులైతే ప్రజా సమస్యలను కచ్చితంగా సభ దృష్టికి తీసుకువెళ్లి జనామోదం పొందగలుగుతారని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
CLP
komatireddy rajagopalreddy
munugodu

More Telugu News