Social Media: ఈ పుకార్లు పుట్టిస్తున్నది తెలుగుదేశం పార్టీయే!: షర్మిళ ఆరోపణ
- సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారం
- టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీ కాదు
- తనపై ఆరోపణలను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారన్న షర్మిళ
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిళ ఆరోపించారు.
"ఐ హ్యావ్ నాచురల్ రీజన్స్ టూ అక్యూజ్ తెలుగుదేశం పార్టీ.. దట్ దే ఆర్ బిసైడ్ దిస్ మడ్ స్లింగింగ్. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తముందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే. ఆ తరువాత నాన్న ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆయనది ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో... ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది.
తర్వాత మా అన్న, జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, ఆటిట్యూడ్ ఉన్నవాడని... ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీనే. కానీ, ఆయన ఎంత సౌమ్యుడో, ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తున్నది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే, ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫైర్ ఉందని మాట్లాడలేదు?
ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్ మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు గారు, ఓ అమ్మాయి మీద అలా మాట్లాడటం తప్పు అని ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పయినా సరే, దాన్ని నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబుగారే, వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ల నాయకులు వీటిని అనుసరిస్తారు. ఇదే వాస్తవం" అని షర్మిల నిప్పులు చెరిగారు.