raj thackeray: కుమారుడి పెళ్లికి మోదీని పిలవని రాజ్ థాకరే!

  • అద్వానీ, సోనియా, రాహుల్, రాజ్ నాథ్ తదితరులకు అందిన ఆహ్వానాలు
  • ఆహూతుల జాబితాలో మోదీ పేరు లేదని సమాచారం
  • వివాహబంధాన్ని మోదీ నమ్ముతారా? అంటూ గతంలో ప్రశ్నించిన రాజ్ థాకరే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే కుమారుడి వివాహం ఈ నెలాఖరులో జరగనుంది. ఈ శుభకార్యానికి పలువురు అగ్ర రాజకీయ నేతలను ఆహ్వానించారు. అద్వానీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మేనకా గాంధీ, సుష్మాస్వరాజ్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.

గతవారం రాజ్ థాకరే ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా... అనివార్య కారణాల వల్ల ఆయన ఆగిపోయారు. దీంతో, ఆయనకు అత్యంత సన్నిహితులైన హర్షల్ దేశ్ పాండే, మనోజ్ హతేలకు ఆహ్వాన పత్రికలకు అందించే బాధ్యతను అప్పగించారు. ఆహూతుల జాబితాలో మోదీ పేరు లేదనే తెలుస్తోంది.

ఇటీవల ఇదే అంశంపై రాజ్ థాకరేను మీడియా ప్రశ్నించింది. కుమారుడి వివాహానికి మోదీని ఆహ్వానిస్తారా? అని మీడియా అడగ్గా... 'వివాహబంధాన్ని మోదీ నమ్ముతారా?' అంటూ రాజ్ థాకరే బదులిచ్చారు.
raj thackeray
son
marriage
invitation
mns
bjp

More Telugu News