balakrishna: కన్నడ స్టార్ హీరో మూవీలో బాలకృష్ణ గెస్ట్ రోల్?

  • శివరాజ్ కుమార్ నుంచి 125వ సినిమా
  • టైటిల్ గా 'భైరతి రణగళ్'
  • దర్శకనిర్మాతగా నార్తన్     
కన్నడలో సీనియర్ స్టార్ హీరోగా శివరాజ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇంతవరకూ ఆయన 124 సినిమాలు చేశారు. ఆయన 125వ సినిమాగా 'భైరతి రణగళ్' నిర్మితమవుతోంది. శ్రీ ముత్తు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి నార్తన్ దర్శకనిర్మాతగా వ్యవహరించనున్నాడు. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, శివరాజ్ కుమార్ మరింత శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలోని ఒక కీలకమైన అతిథిపాత్ర ఉండటంతో, ఆ పాత్రను చేయవలసిందిగా ఆయన బాలయ్యను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. శివరాజ్ కుమార్ కి .. బాలకృష్ణకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువల్లనే గతంలో బాలకృష్ణ అడగ్గగానే ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి'సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. అలాగే ఇప్పుడు 'భైరతి రణగళ్' సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారన్న మాట.
balakrishna
shivaraj kumar

More Telugu News