Telangana: మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న కేసీఆర్.. తొలుత 8 మందికే చోటు.. సీఎం జాబితాలో ఉన్నది వీరే!
- స్పీకర్ ఎంపిక తర్వాత పూర్తి స్పష్టత
- మలి విడతలో మరో 8 మంది
- పోచారానికి స్పీకర్ పదవి?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతున్నారు. తొలుత ఎనిమిది మందితో మంత్రివర్గాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఆ 8 మంది పేర్లతో జాబితాను కూడా సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలి విస్తరణ పూర్తయ్యాక మరో 8 మందిని కేబినెట్లోకి తీసుకోనున్నారు.
ఇక కేసీఆర్ సిద్ధం చేసినట్టు చెబుతున్న జాబితాలో కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లేదంటే పద్మాదేవేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదంటే ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, వినయ్ భాస్కర్ లేదంటే జోగు రామన్న, జగదీశ్ రెడ్డి లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి లేదంటే పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి లేదంటే లక్ష్మారెడ్డి, రెడ్యానాయక్ లేదంటే రేఖానాయక్‌లను మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది.
స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపికైతే కనుక ఆ సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థి తగ్గుతారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి స్పీకర్ ఎంపికైనా ప్రస్తుతం చెబుతున్న పేర్లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పోచారానికి స్పీకర్ పదవి లభిస్తే నిజామాబాద్‌కు చెందిన ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది. అలాగే, పద్మాదేవేందర్ రెడ్డి, రేఖానాయక్‌లు ఎంపికైనా ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నట్టు తెలుస్తోంది.