India: భారత నిఘా అధికారులకు దావూద్ అనుచరుడి సాయం.. కిరాతకంగా చంపించిన మాఫియా డాన్!

  • పాకిస్తాన్ లోని కరాచీలో ఘటన
  • దుబాయ్ లో పోలీసులకు దొరికిన ఫరూక్
  • ఆదేశాలు అమలు చేసిన ఛోటాషకీల్

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా ఉన్న ఫరూక్ దేవ్డీవాలాను సొంత ముఠా సభ్యులే కిరాతకంగా హత్య చేశారు. దావూద్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని భారత్ కు అప్పగించడాన్ని గుర్తించిన ఛోటా షకీల్ కరాచీలో అతడిని తుపాకీతో కాల్చి చంపించాడు. ఛోటా షకీల్ దావూద్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డాడు.

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలో యువతను చేరేలా ఆకర్షించడంతో పాటు చాలా నేరాల కింద ఫరూక్ ను అరెస్ట్ చేసేందుకు భారత సంస్థలు యత్నిస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో దుబాయ్ అధికారులు ఫరూక్ ను అరెస్ట్ చేశారు. అయితే డిపోర్టేషన్ ప్రక్రియ కింద భారత్ అతడిని అప్పగించాల్సిందిగా కోరకముందే పాకిస్తాన్ తప్పుడు పత్రాలతో ఫరూక్ ను కాపాడి తీసుకెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో దుబాయ్ లోని భారత నిఘా సంస్థల ఉన్నతాధికారులతో ఫరూక్ చర్చలు జరిపినట్లు డీ-గ్యాంగ్ గుర్తించింది. ఇక అతడిని బతకనివ్వడం సేఫ్ కాదని భావించిన దావూద్ ఇబ్రహీం.. చంపేయాల్సిందిగా ఛోటా షకీల్ కు ఆదేశాలు జారీచేశాడు. ఇంతకుముందు దావూద్ పట్ల అగౌరవంగా ప్రవర్తించడంతో ఫిరోజ్ కొకానీ అనే మరో అనుచరుడ్ని 2000లో కాల్చిచంపారు. పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్న దావూద్ ప్రస్తుతం కరాచీ కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News