sensex: భారీ లాభాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు
- ఆర్బీఐ మానిటరీ పాలసీలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాలు
- కొనుగోళ్లకు మొగ్గు చూసిన ఇన్వెస్టర్లు
- 465 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో... ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 465 పాయింట్లు పెరిగి 36,318కి చేరుకుంది. నిఫ్టీ 149 పాయింట్లు పుంజుకుని 10,887కు ఎగబాకింది. విప్రో, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి కంపెనీలు నష్టాల్లో ముగిశాయి.