Education Institutions: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్: కేంద్ర మంత్రి జవదేకర్

- 40 వేల కాలేజీలు, 900 వర్సిటీల్లో అమలు
- రిజర్వేషన్ల అమలు కోసం 25 శాతం సీట్ల పెంపు
- త్వరలోనే మార్గదర్శకాలు విడుదల
వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతోపాటు కొత్తగా తీసుకొచ్చిన అగ్రవర్ణాలలోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల కాలేజీలు, 900 యూనివర్సిటీలలో రానున్న విద్యా సంవత్సరం నుంచి పది శాతం రిజర్వేషన్‌ను కూడా అమలు చేస్తామన్నారు. పాత రిజర్వేషన్లకు ఈ పది శాతం అదనమని స్పష్టం చేశారు. కొత్త రిజర్వేషన్ల అమలు కోసం విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పెంచనున్నట్టు వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను యూజీసీ, ఏఐసీటీఈ విడుదల చేస్తాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు.