Theresa May: అనూహ్య విజయం... బ్రెగ్జిట్ లో ఓడినా, విశ్వాస పరీక్షలో గెలిచిన థెరీసా మే!
- బ్రెగ్జిట్ బిల్లులో 432-202 తేడాతో ఓటమి
- విశ్వాస పరీక్షలో 325 - 302 తేడాతో విజయం
- ప్రధాని పదవికి ఇబ్బంది లేనట్టే
బ్రెగ్జిట్లో ఓటమిపాలై, అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్న బ్రిటన్ ప్రధాని థెరీసా మే, అనూహ్య విజయం సాధించారు. బుధవారం సాయంత్రం ఓటింగ్ జరుగగా, ఆమెపై తమకు విశ్వాసముందని 325 మంది తమ వోటు ద్వారా చెప్పారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 302 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతానికి ఆమె పదవికి ఇక ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
సాధారణంగా ఓ బిల్ పై ఓటింగ్ జరిగి, ఆ బిల్లు ఆమోదం పొందకుంటే, మరుసటి రోజు జరిగే విశ్వాస పరీక్షలో ఓటమిపాలై గద్దె దిగుతుంటారు. కానీ, చరిత్రను తిరగరాసిన థెరీసా మే 432-202 తేడాతో బ్రెగ్జిట్ లో ఓటమిపాలైనా, విశ్వాస పరీక్షను మాత్రం గెలవడం గమనార్హం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని అత్యధిక ప్రజలు కోరుకున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రజా ప్రతినిధులు మాత్రం ఈయూతో కలిసుంటేనే మేలు కలుగుతుందని నమ్ముతున్నారని, అదే విషయం పార్లమెంట్ లో నిరూపితమైందని నిపుణులు వ్యాఖ్యానించారు.