telangan: తెలంగాణ అసెంబ్లీలో సీనియర్ ఎవరు? జూనియర్ ఎవరు?

  • 8 సార్లు గెలుపొందిన కేసీఆర్ అందరి కంటే సీనియర్ ఎమ్మెల్యే
  • వయసు రీత్యా చూసుకుంటే వనమా వెంకటేశ్వరరావు సీనియర్
  • జూనియర్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 23 మంది తొలిసారి గెలుపొందారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో ఇద్దరు ప్రస్తుత ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.

అసెంబ్లీలో అందరి కంటే సీనియర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆరే. 1985 నుంచి ఇప్పటి వరకు ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ తర్వాత ముంతాజ్ అహ్మద్ ఖాన్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకరరావులు సీనియర్లు. వయసు రీత్యా చూసుకుంటే అందరికంటే పెద్దవారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఆయన వయసు 73 సంవత్సరాలు. పిన్న వయస్కురాలు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్. ఆమె వయసు 29 ఏళ్లు మాత్రమే.

  • Loading...

More Telugu News