Rakul: నువ్వు అసభ్యంగా కనిపిస్తూ, మరో మహిళను అంటావా?: రకుల్ ప్రీత్ పై నెటిజన్ల నిప్పులు!
- పొట్టి దుస్తులతో కారు దిగిన రకుల్ ప్రీత్
- ట్రోలింగ్ పై స్పందిస్తూ, అభ్యంతరకర కామెంట్ చేసిన రకుల్
- విమర్శలతో ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు
- మరోసారి స్పందించిన రకుల్
"నీపై వచ్చిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?" అని ఒకరు, "అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా?" అని ఇంకొకరు, "నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు" అని మరొకరు... ఇలా సాగుతోంది రకుల్ ప్రీత్ పై నెటిజన్ల ట్రోలింగ్.
ముంబైలో పొట్టి దుస్తులతో కారు దిగుతున్న రకుల్ ఫోటోలు వైరల్ కాగా, ఓ యువకుడు పెట్టిన మెసేజ్ పై రియాక్ట్ అవుతూ, అతని తల్లిని ఈ వివాదంలోకి లాగడంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రకుల్ కామెంట్ ను అతి కొద్దిమంది మాత్రమే సమర్ధిస్తుండగా, పలువురు విమర్శిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది.
"నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి కుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా" అని వ్యాఖ్యానించింది.
Well for people questioning my ethics why don’t you speak up when women are objectified and I’ve chosen my words only to make such #sickminds realise that they have a family too and how would they feel if the same is done to them ! I am sure his mother would give him a slap too
— Rakul Preet (@Rakulpreet) January 17, 2019