kousalya: ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకున్నాడు .. పదహారు రోజుల పండుగనాడే కొట్టాడు: సింగర్ కౌసల్య
- మావగారు చాలా మంచివారు
- మా ఆయన మా అమ్మను తిట్టాడు
- అమ్మ తప్పేం లేదన్నందుకు కొట్టాడు
సింగర్ గా కౌసల్యకి మంచి పేరుంది. చక్రి సంగీత దర్శకత్వంలో ఆమె ఎక్కువ పాటలు పాడారు. అలాంటి కౌసల్య ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారికి .. మా మావగారికి నా పెళ్లికి ముందు నుంచి మంచి సాన్నిహిత్యం వుంది. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది.
నేను చిన్నప్పటి నుంచి వాళ్లింటికి వెళ్లి వస్తుండేదానిని. మా మావగారు చాలా మంచివారు .. ఆయన పోయిన దగ్గర నుంచి మా ఆయనతో సమస్యలు ఎక్కువయ్యాయి. పెళ్లయిన తరువాత 16 రోజుల పండుగకి మేము మా ఆడపడుచు ఇంట్లో వున్నాము. ఆ రోజున ఆయన నన్ను మొదటిసారిగా కొట్టాడు. కారణం చెబితే చాలా సిల్లీగా అనిపిస్తుంది. జిలకర్ర బెల్లంలో జీలకర్ర తగ్గిందనే ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మని తిట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ తప్పేంలేదు అని నేను అన్నందుకు నాపై చేయి చేసుకున్నాడు" అని చెప్పుకొచ్చారు.