sensex: అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి లోనైన మార్కెట్లు
- 53 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 15 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఈ ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 53 పాయింట్లు లాభపడి 36,374కు పెరిగింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,905కు చేరుకుంది. హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టీసీఎస్, హెచ్సీఎల్ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, యస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.