Haryana: జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు
- 2002లో జర్నలిస్టు ఛత్రపతి హత్య కేసులో శిక్ష
- మరో ముగ్గురు దోషులకు యావజ్జీవం
- ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా
2002లో సిర్సాకు చెందిన జర్నలిస్టు ఛత్రపతిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు యావజ్జీవ శిక్ష పడింది. డేరా బాబాతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్ కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా కూడా విధించింది.
కాగా, ఈ కేసులో వీరిని దోషులుగా తేలుస్తూ గత వారం కోర్టు తీర్పు నివ్వగా, ఈరోజు వీరికి శిక్షలు ఖరారు చేసింది. ఇదిలా ఉండగా, అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. హరియాణాలోని రోహతక్ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు.