Team India: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. టాస్‌ను ఆలస్యం చేసిన వరుణుడు

  • రెండో వన్డేలో సిరాజ్ చెత్త ప్రదర్శన
  • చాహల్, కేదార్ జాదవ్‌, విజయ్ శంకర్‌లకు చోటు
  • రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న ఆసీస్
సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ పది నిమిషాలు ఆలస్యమైంది. అయితే, అవి చిన్నపాటి చినుకులే కావడంతో ఆటపై ప్రభావం చూపించే అవకాశం లేదు. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘోరంగా విఫలమైన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌, కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్, రాయుడు స్థానంలో కేదార్ జాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అరోన్ ఫించ్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బౌలర్లు బెహ్రెండార్ఫ్, నాథన్ లియాన్ స్థానాల్లో బిల్లీ స్టాన్‌లేక్, ఆడం జంపాలను తుది జట్టులోకి  తీసుకుంది.
Team India
Australia
Melbourne
One-day
Crime News
Virat Kohli

More Telugu News