Tajmahal: ప్రేమించమంటూ 'తాజ్ మహల్' బొమ్మను విసిరితే... అమ్మాయి తండ్రి తల పగిలింది!
- తాజ్ బొమ్మను తీసుకుని ప్రేమను అంగీకరించాలని డిమాండ్
- బొమ్మను విసరగా తగిలి తీవ్రగాయం
- యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమర ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ బొమ్మను తీసుకుని, తన ప్రేమను అంగీకరించాలని కోరుతూ, ఓ యువకుడు చేసిన యత్నం విఫలమై, అతన్ని కటకటాల్లోకి నెట్టింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జీతు అనే యువకుడు, కొంతకాలంగా ఓ యువతి వెంటపడుతూ, ప్రేమించాలని వేధిస్తున్నాడు. తన వద్ద ఉన్న తాజ్ మహల్ బొమ్మను తీసుకుని, ప్రేమను అంగీకరించాలని కోరుతున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల, ఆమె ఇంటి వద్దకు వచ్చిన అతను, బొమ్మను తీసుకోవాలంటూ, దాన్ని పైకి విసిరాడు. అది కాస్తా, అక్కడే కూర్చుని భోజనం చేస్తున్న ఆ యువతి తండ్రి తలకు తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర గాయం కాగా, యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, జీతును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.