tammareddy: నాకు బాలకృష్ణ ఇష్టమంటే దాని అర్థం .. చిరంజీవి అంటే ఇష్టం లేదని కాదు: తమ్మారెడ్డి భరద్వాజ
- నేను ఎవరినీ విమర్శించను
- నాకు ఎవరూ శత్రువులు లేరు
- ఇలాంటి ప్రచారాలు కరెక్ట్ కాదు
తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తన మాటలను కొంతమంది వక్రీకరించడంపట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా నాకు నచ్చింది .. నేను నమ్మింది చెప్పడం నాకు అలవాటు. అంతేగాని ఎవరినీ నేను విమర్శించను .. ఎవరికీ నేను శత్రువును కాదు కూడా. ఒకానొక సందర్భాన్ని తీసుకుని బాలకృష్ణ అంటే నాకు ఇష్టమని చెబితే, చిరంజీవిని రెచ్చగొట్టడం కోసమే అలా చెప్పానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
మరో సందర్భంలో చిరంజీవి నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని చెప్పాను. డబ్బులు తీసుకోకుండా సినిమా చేసి పెట్టాడని అన్నాను. ఆ విషయాన్ని గురించి ఎవరూ మాట్లాడరు. ఒకసారి షూటింగులో చిరంజీవి గాయపడితే ఆపేద్దామని చెప్పాను .. అయినా వినకుండా చేశాడు అని కూడా అన్నాను. ఆ సంగతిని ఎవరూ హైలైట్ చేయరు. కానీ బాలకృష్ణ ఇష్టం అనగానే .. కొంతమంది తమకి తగినట్టుగా ఆ విషయాన్ని మార్చేసి చిరంజీవి వైపుకు తిప్పుతున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్టు కాదు" అని ఆయన చెప్పుకొచ్చారు.