cellphone battery blast: పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ...మూడో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు

  • దొరికిన బ్యాటరీని సంచిలో పెట్టుకున్న చిన్నారి
  • తరగతి గదిలో ఆడుకునేందుకు తీయగా ఘటన
  • ముఖానికి, చేతికి, ఛాతికి గాయాలు

ప్రమాదాన్ని ఊహించని ఓ చిన్నారి రోడ్డుపై దొరికిన ఓ సెల్‌ఫోన్‌ బ్యాటరీని ముచ్చటపడి దాచుకుంటే, అదే అతని ప్రాణాల మీదికి తెచ్చింది. ఎవరో వాడి బయట పడేసిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ  తరగతిలో పేలి తీవ్రంగా గాయపడ్డాడు. తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి  ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్‌ఎం అందించిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన మామిడాల శంకర్‌ కొడుకు రాజు ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చాడు. గణితం టీచర్‌ క్లాస్‌ జరుగుతోంది. ఆ సమయంలో రాజు తన పుస్తకాల సంచిలో భద్రపరిచిన సెల్‌ఫోన్‌ బ్యాటరీని బయటకు తీశాడు. దాంతో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి అది పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేగింది.

ఏం జరిగిందో అర్థంకాక క్లాస్‌లో టీచర్‌ టెన్షన్‌ పడగా, పిల్లలు భయంతో ఓ మూలకు చేరిపోయారు. గమనిస్తే పేలుడు కారణంగా రాజు ముఖం, ఛాతి, చేతికి తీవ్రగాయాలై రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే అతనికి ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం జనగామలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News