Mallu Bhatti Vikramarka: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు.. బహిరంగ సభలో ప్రసంగించినట్టుంది: భట్టి

- సభను ప్రజాస్వామ్యయుతంగా నడుపుతారని ఆశిస్తున్నా
- పింఛను, నిరుద్యోత భృతిపై స్పష్టత లేదు
- ప్రభుత్వ హామీలు అమలయ్యేలా పనిచేయిస్తాం
నేటి సభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని.. బహిరంగ సభలో ప్రసంగించినట్టుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నేడు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కలుసుకున్న భట్టి.. తనను సీఎల్పీ లీడర్‌గా నియమిస్తూ పార్టీ ఇచ్చిన లేఖను అందజేశారు.
అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని.. టీఆర్ఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ లొంగరన్నారు. తనకు సీఎల్పీ లీడర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సభను ప్రజాస్వామ్యయుతంగా, హుందాగా నడుపుతారని ఆశిస్తున్నామన్న భట్టి.. పింఛను, నిరుద్యోగ భృతిపై స్పష్టత లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా తాము నిర్మాణాత్మకంగా పనిచేయిస్తామని భట్టి స్పష్టం చేశారు.